¡Sorpréndeme!

ఈ కాయలు తిని డ్రైవింగ్ చేస్తే మీరు ఫసక్ ! | Oneindia Telugu

2018-11-26 1 Dailymotion

If you eat this fruit you will surely booked in drunk and drive case.
#DrunkAndDrive
#breathanalyser
#Drunk
#Fruit
#drinkingpoints


డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం అనే విషయం తెలిసిందే. మందు తాగి డ్రైవింగ్ చేస్తే శిక్ష తప్పదు. సాధారణంగా మద్యం తాగి వాహనం నడుపుతూ బ్రీత్ ఎనలైజర్ టెస్టులో పట్టుబడితే 35 పాయింట్లు దాటితే జైలు శిక్షతో పాటు వాహనం సీజ్ చేయాలని నిబంధనలు ఉన్నాయి. అయితే, మీరు మందు తాగితేనే కాదు, ఓ పండు తిని డ్రైవింగ్ చేసినా కూడా బ్రీత్ ఎనలైజర్‌లో రీడింగ్ ఎక్కువగానే చూపిస్తుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని స్వయంగా పోలీసులే పరిశీలించారు. ఈ వీడియోలో.. ఓ పోలీసు తొలుత బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసుకుంటాడు. అప్పుడు సున్నా (జీరో) పాయింట్లు వస్తుంది. ఆ తర్వాత అక్కడే ఉన్న రేగు పండ్లు తీసుకొని తింటారు. ఓ రెండు మూడు పంట్లు తింటారు. ఆ తర్వాత మరోసారి బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేసుకుంటారు.